కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఇప్ప టి వరకు ఒక్క కోవిడ్ కేసు నమోదు కాలేదు. ఎవ్వరికై నా జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలు ఉంటే ఆసుపత్రిలోని ఓపీ నెం.99లో చికిత్స చేయించుకోవాలి. అవసరమైన వారికి అక్కడి వైద్యులు వైద్యపరీక్షలు నిర్వహించి కోవిడ్‌ను నిర్ధారిస్తారు. ఒకవేళ ఎవ్వరికై నా కోవిడ్ నిర్ధారణ అయితే పరిస్థితి దృష్ట్యా వారిని ఆసుపత్రిలో చేర్చుకోవడమా లేదా ఇంటి వద్దే ఐసోలేషన్‌లో ఉంచడమా అనేది వైద్యులు నిర్ణయిస్తారు. కోవిడ్ కేసులు వచ్చినా అందుకు అవసరమైన ఆక్సిజన్, మందులు, సర్జికల్స్, కిట్లు సిద్ధంగా ఉంచాం.
– డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల


