
చిత్రం.. భళా!
పెన్ను క్యాప్‌పై వేసిన
వినాయక చిత్రాలు
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాలకు చెందిన చిత్రకారుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు తుర్లపాటి సుబ్రహ్మణ్యం కర్పూరం బిళ్లపై గీసిన వినాయకుడి సూక్ష్మ చిత్రం ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా చిత్రకారుడు మాట్లాడుతూ భగవంతునికి చేసే షోడశోపచారాలలో ఆనంద కర్పూర నీరాజనం విశిష్టమైనదన్నారు. ప్రజలందరికీ గణేశుని అనుగ్రహం కలగాలనీ, విఘ్నాలు తొలగాలని కోరుకుంటూ కర్పూరం బిళ్లపై వరసిద్ధి వినాయకుని సూక్ష్మ చిత్రాన్ని వేశానన్నారు.
– నంద్యాల(వ్యవసాయం)
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ పెన్ను క్యాప్‌పై 60 వినాయకుల చిత్రాలు గీచి అబ్బురపరిచారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ చిత్రంలో గణనాథుడు భక్తులకు అభయమిస్తున్నట్లు, ఓంకారంలో గణపతులు, శంకు ఆకారంలో గణేషుడు, కానిపాకం గణపతి, త్రిముఖ గణపతి, నాట్య భంగిమ గణపతి ఇలా పలు రూపాల్లో ఒకే క్యాప్‌పై 60 చిత్రాలు గీశానన్నారు. స్వామి వారి వాహనమైన ఎలుక స్వామిని భక్తితో మొక్కుతున్నట్లు చిత్రించానన్నారు.
– నంద్యాల(అర్బన్)

చిత్రం.. భళా!