
దాడి అనంతరం జీపులో వెళ్తున్న టీడీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డి
టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి సోదరుడుని దౌర్జన్యం
టోల్‌గేట్ అసిస్టెంట్ మేనేజర్‌పై దాడి
సాక్షి, టాస్క్‌ఫోర్స్: అధికారం చేతిలో ఉందని టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. అడ్డొచ్చిన వారు ఎవరైనా దౌర్జన్యానికి తెగబడుతున్నారు. ఓ స్థాయి నేతలే కాదు, వాళ్ల కుటుంబ సభ్యులు సైతం దురుసుగా ప్రవర్తిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. రూ.30 టోల్‌గేట్ కూడా చెల్లించలేని స్థితిలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి సోదరుడు శ్రీనివాసు రెడ్డి ఏకంగా టోల్‌గేట్ ఉద్యోగిపై దాడికి పాల్పడటం గమనార్హం.
నందవరం మండల పరిధిలోని 167వ జాతీయ రహదారిలోని ధర్మపురం టోల్‌గేట్ వద్ద శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన అనుచరులు గురువారం మధ్యాహ్నం మంత్రాలయం వైపు జీపులో వెళ్లారు. అయితే టోల్‌గేట్ వద్ద ఆటోమెటిక్‌గా ఫాస్టాగ్‌లో రూ.30 డెబిట్ కావడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తన వద్దే టోల్ వసూలు చేస్తారా అంటూ అసిస్టెంట్ మేనేజర్ కుల్‌దీప్ యాదవ్‌పై దాడికి పాల్పడ్డారు.
శ్రీనివాసరెడ్డితో పాటు జీపు డ్రైవర్, తన అనుచరుడు కలిసి కుల్‌దీప్ యాదవ్‌పై చేయి చేసుకున్నారు. అయితే టోల్‌గేట్ సిబ్బంది అక్కడ గుమికూడటంతో శ్రీనివాసరెడ్డి మంత్రాలయం వైపునకు వెళ్లిపోయాడు. ఈ విషయమై ఎస్‌ఐ కేశవను ‘సాక్షి’ వివరణ కోరగా తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు.