
నంద్యాల: బాలికను బెదిరించి ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలిక గర్భం దాల్చడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నంద్యాల టూటౌన్ సీఐ అస్రార్‌బాషా తెలిపిన వివరాలు.. నంద్యాలకు చెందిన బాలిక(16)ను కొన్ని నెలల కిందట సలీంనగర్‌కు చెందిన అబీద్, అప్రోజ్ అనే యువకులు బెదిరించి.. అత్యాచారం చేశారు. అప్పటి నుంచీ బాలికను బెదిరిస్తూ.. వారు అఘాయిత్యానికి పాల్పడుతున్నారు.
ఈ క్రమంలో బాలికకు నెలసరి సరిగ్గా రాకపోవడం.. తరుచూ కడుపునొప్పి అని చెబుతుండడంతో తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె గర్భం దాల్చిందని తేల్చారు. తల్లి గట్టిగా నిలదీయడంతో.. జరిగిన ఘోరాన్ని బాలిక చెప్పింది. వెంటనే బాలిక తల్లి నంద్యాల టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇద్దరు నిందితులపై అత్యాచారం, పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.