జెడ్పీలో గణనాథునికి చైర్మన్‌ పాపిరెడ్డి పూజలు | - | Sakshi
Sakshi News home page

జెడ్పీలో గణనాథునికి చైర్మన్‌ పాపిరెడ్డి పూజలు

Aug 29 2025 2:10 AM | Updated on Aug 29 2025 2:10 AM

జెడ్పీలో గణనాథునికి చైర్మన్‌ పాపిరెడ్డి పూజలు

జెడ్పీలో గణనాథునికి చైర్మన్‌ పాపిరెడ్డి పూజలు

కర్నూలు(అర్బన్‌): వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక జిల్లా పరిషత్‌ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన గణనాథునికి బుధవారం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ యర్రబోతుల పాపిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి, చైర్మన్‌ సీసీ అశ్వినీకుమార్‌, జెడ్పీలోని వివిధ విభాగాలకు చెందిన పరిపాలనాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్‌ పాపిరెడ్డి మాట్లాడుతూ.. వినాయకచవితి పర్వదినం సందర్భంగా అందరికి శుభాలు కలగాలని, చేపట్టిన కార్యక్రమాలన్ని విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆ విఘ్నేశ్వరున్ని ప్రార్థించడం జరిగిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement