
బస్సు రాలేదని పోలీస్ స్టేషన్‌కు చేరిన విద్యార్థులు
పోలీసు జీపులో గమ్యస్థానాలకు
హొళగుంద: బస్సు రాలేదంటూ విద్యార్థులు పోలీస్‌స్టేషన్ మెట్లెక్కిన ఘటన హొళగుందలో మంగళవారం చోటుచేసుకుంది. ముద్దటమాగి గ్రామానికి చెందిన విద్యార్థులు హొళగుంద హైస్కూల్‌లో చదువుతున్నారు. రోజూ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం స్కూల్ వదిలిన తర్వాత హొళగుంద బస్టాండులో బస్సు కోసం దాదాపు 20 మంది విద్యార్థులు వేచి ఉన్నారు. ఎంతకూ బస్సు రాకపోవడంతో విద్యార్థులు సమీపంలోని పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. లోపుల ఉన్న ఎస్‌ఐ దిలీప్‌కుమార్ సీసీ కెమెరాలో విద్యార్థులను గమనించి సమస్యను ఆరా తీశారు. బస్సు రాలేదని చెప్పడంతో ఆయన ఆదోని ఆర్టీసీ డిపో మేనేజర్‌కు ఫోన్ చేసి విచారించారు. రోడ్డు బాగోలేకపోవడంతో బస్సు ఆలస్యమైనట్లు తెలుసుకుని ఎస్‌ఐ తన జీపులో విద్యార్థులను ముద్దటమాగికి చేర్చారు.
పంపించిన ఎస్‌ఐ

బస్సు రాలేదని పోలీస్ స్టేషన్‌కు చేరిన విద్యార్థులు