కిడ్నీ మార్పిడి చేయిస్తానని మోసం చేశాడు | - | Sakshi
Sakshi News home page

కిడ్నీ మార్పిడి చేయిస్తానని మోసం చేశాడు

Aug 12 2025 10:31 AM | Updated on Aug 13 2025 5:24 AM

కిడ్నీ మార్పిడి చేయిస్తానని మోసం చేశాడు

కిడ్నీ మార్పిడి చేయిస్తానని మోసం చేశాడు

నంద్యాల: ‘కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న నాకు మా నాన్న మిత్రుడు కిశోర్‌ తన సోదరుడు డాక్టర్‌ సునీల్‌ ద్వారా కిడ్నీ మార్పిడి చేయిస్తానని నమ్మించి రూ. 19.84 లక్షలు తీసుకుని మోసం చేశాడు. ఆపరేషన్‌ చేయించకుండా డబ్బులు తిరిగి ఇవ్వకుండా భయపెడుతున్నాడు’ అంటూ నంద్యాల పట్టణానికి చెందిన ధనుంజయ్‌ ఎస్పీ అధిరాజ్‌సింగ్‌ను ఆశ్రయించి వినతి పత్రం అందజేశారు. సోమవారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో ప్రజా ఫిర్యా దుల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఎస్పీ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పీజీఆర్‌ఎస్‌లో 89 వినతులు వచ్చాయని, వాటిపై పూర్తిస్థా యి విచారణ చేసి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట పరిధి లో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, ఫిర్యాదులను పునరావృతం కాకుండా చూడాలని, నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు.

ఫిర్యాదుల్లో కొన్ని....

● ఉయ్యాలవాడ మండలం తుడుమలదిన్నె గ్రామంలో నాకు 1.27 సెంట్ల భూమి ఉంది, నా పక్కన పొలం ఉన్న దస్తగిరిరెడ్డి నా పొలంలోని 17 సెంట్లను ఆక్రమించుకొని రెండు సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్నాడు. విచారణ చేయించి న్యాయం చేయండి’ అంటూ ఆ గ్రామానికి చెందిన మోహన్‌రావు ఎస్పీకి వినతి పత్రం అందజేశారు.

● నాకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుర్లు సంతానం. నా భర్త పేరు మీద 2.64 సెంట్ల భూమి ఉంది. ఆయన మరణానంతరం నాకు రావాల్సిన ఆ భూమిని నాకు తెలియకుండా నా పెద్ద కొడుకు మద్దిలేటి అక్రమంగా పట్టాదారు పాస్‌ పుస్తకం తీసుకున్నాడు. ఇందులో 1.28 సెంట్ల భూమిని వేరే వాళ్లకు అమ్ముకున్నాడు. మద్దిలేటిపై చట్టపరమైన చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయాలని చాగలమర్రి మండలం శెట్టివీడు గ్రామానికి చెందిన కె.నరసమ్మ ఎస్పీకి వినతి పత్రం అందజేశారు.

19.84 లక్షలు తీసుకుని బెదిరిస్తున్నాడు

ఎస్పీని ఆశ్రయించిన బాధితుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement