
వీరభద్రస్వామికి పెళ్లి కుమార్తె నచ్చింది...
● కార్తీక మాసంలో నిశ్చితార్థం
ఆస్పరి: శ్రావణ మాసం ఉత్సవాల్లో భాగంగా మూడవ సోమవారం కై రుప్పల గ్రామంలో వెలసిన వీరభద్రస్వామి, కాళికాదేవిల పెళ్లి చూపులు కార్యక్రమం వైభవంగా సాగింది. మధ్యవర్తులు పుప్పాలదొడ్డి గిడ్డాంజనేయస్వామి, చెన్నంపల్లి కాత్రికేయ స్వామి సమక్షంలో సంప్రదాయం ప్రకారం చేపట్టిన పెళ్లి చూపుల్లో వీరభద్రస్వామికి కాళికాదేవి నచ్చడంతో కార్తీక మాసం ముగిసిన తరువాత వచ్చే మొదటి సోమవారం నిశ్చితార్థం ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. ఉగాది వేడుకల్లో భాగంగా వీరభద్రస్వామికి, కాళికాదేవికి పెళ్లి జరిపిస్తామని గ్రామస్తులు తెలిపారు. శ్రావణ మాసం ఉత్సవాల్లో భాగంగా సోమవారం కై రుప్పల గ్రామస్తులు తంగభద్ర జలాలు తెచ్చి వీరభద్రస్వామి, కాళికాదేవిలకు అభిషేకం చేశారు. సంప్రదాయం ప్రకా రం ప్రతి ఏటా గ్రామస్తులు భజన చేసుకుంటూ పాద యాత్ర ద్వారా తుంగభద్ర జలాలలను తీసుకొచ్చి స్వామి వారికి అభిషేకం చేస్తామని చెప్పారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లను పూల పల్లకీలో మేళతాళాలతో ఊరేగించారు. భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.

వీరభద్రస్వామికి పెళ్లి కుమార్తె నచ్చింది...

వీరభద్రస్వామికి పెళ్లి కుమార్తె నచ్చింది...