
ముగిసిన సప్తరాత్రోత్సవాలు
మంత్రాలయం: సద్గురు రాఘవేంద్రస్వామి 354వ ఆరాధన సప్తరాత్రోత్సవాలు గురువారంతో ముగిశాయి. వేడుకల్లో భాగంగా శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు నేతృత్వంలో చివరిరోజు సంబరాలు కనుల పండువగా జరిగాయి. ఉదయం మండలంలోని అను మంత్రాలయం (తుంగభద్ర)లోని మఠంలో రాఘవేంద్రస్వామి రథోత్సవం చేపట్టారు. ముందుగా ఉత్సమూర్తి ప్రహ్లాదరాయలకు చామర్ల సేవతో హారతులు పట్టారు. అనంతరం రథంపై కొలువుంచి గ్రామ పుర వీధుల్లో వైభవంగా ఊరేగించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి ఆరాధన ఉత్సవాల విశిష్టతను భక్తులకు వివరించారు. రాత్రి శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో ఉత్సవమూర్తికి పంచ వాహనాలతో రథయాత్ర చేపట్టారు. ఈ వేడుకలు ఏడు రోజుల పాటు భక్తులను ఆధ్యాత్మిక చింతనలో ముంచెత్తాయి.

ముగిసిన సప్తరాత్రోత్సవాలు