
కూటమి ప్రభుత్వం మోసం చేసింది
దివ్యాంగులను కూటమి ప్రభుత్వం మోసం చేసింది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని తుంగలో తొక్కింది. వెరిఫికేషన్ పేరిట వికలత్వం శాతం తగ్గించింది. పింఛన్ల రద్దుకు కుట్ర పన్నింది. వంద నుంచి 80 శాతం వికలత్వం సర్టిపికెట్ ఉన్న వారికి నెలకు రూ.15 వేల పింఛన్ ఇస్తున్నారు. ఇప్పుడు వికలత్వం 60 నుంచి 70 శాతానికి కుదించి రూ. 6 వేల పింఛన్ ఇవ్వడానికి కుట్ర చేశారు. గతంలో డాక్టర్లు శాశ్వత సర్థిఫికెట్లు జారీ చేశారు. అప్పుడు ఇచ్చిన డాక్టర్, ఇప్పుడు ఇచిన డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్‌కు తేడా ఏమిటో ప్రభుత్వమే చెప్పాలి. దివ్యాంగులకు న్యాయం చేయాలి. లేదంటే ఉద్యమం చేస్తాం.
– మరియదాసు, దివ్యాంగుల ఆదరణ సేవా సమితి అధ్యక్షుడు

కూటమి ప్రభుత్వం మోసం చేసింది