
నీటి సంరక్షణ పనులు చేపట్టాలి
నంద్యాల: జిల్లాలో నీటి సంరక్షణ పనులు విస్తృతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులకు సూచించారు. గురువారం విజయవాడ సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు భూగర్భజలాల సంరక్షణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నంద్యాల కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జేసీ విష్ణు చరణ్, నీటి వినియోగదారుల సంఘాల డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు, నీటిపారుదల శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో నీటి పారుదల శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి భూగర్భ జలాలు పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. ఇక నుంచి ప్రతి గ్రామంలో కురిసిన వర్షపు నీరు అక్కడే ఇంకిపోయేలా నీటి సంరక్షణ పనులు చేపట్టాలన్నారు. నీటి సంఘాల సభ్యులు నీటి ప్రాధాన్యతను తెలుసుకోవాలన్నారు.