బాబు మోసానికి రోడ్డునపడి
చిత్రంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్న యువకుడి పేరు వెంకటేష్, సొంతూరు మండల కేంద్రం రుద్రవరం. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వలంటీర్‌గా పనిచేశాడు. ప్రతి నెల గౌరవ వేతనంగా రూ.5వేలు ఇచ్చేవారు. అలాగే చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి జీవనోపాధి లేకుండా చేసింది. ఎన్నికలకు మందు అధికారంలోకి వస్తే వలంటీర్లకు గౌరవ వేతనం కింద రూ.10వేలు ఇస్తామని కూటమి నేతలు బహిరంగానే ప్రకటించారు. అధికారంలోకి వచ్చకా పెంపు మాట పక్కన పెడితే ఉన్న వలంటీర్ వ్యవస్థనే తొలగించారు. దీంతో కుటుంబ పోషణకు ఊరిలో పని ఉన్నప్పుడు వెంకటేష్ ట్రాక్టర్ డ్రైవర్‌గా వెళ్తున్నాడు.


