మొబైల్ బుక్ కీపింగ్ వంద శాతం పూర్తి చేయాలి
నంద్యాల(న్యూటౌన్): స్వయం సహాయక సంఘాల మొబైల్ బుక్ కీపింగ్ ప్రతి నెలా వంద శాతం పూర్తి చేయాలని సెర్ప్ అడిషనల్ సీఈఓ శ్రీరాములు నాయుడు ఆదేశించారు. పట్టణంలోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో మంగళవారం డీఆర్‌డీఏ, వెలుగు సిబ్బందితో ఆయన పీడీ శ్రీధర్‌రెడ్డితో కలసి సమీక్ష నిర్వహించారు. సంస్థాగత నిర్మాణం, సంఘా లు, గ్రామ సంఘాలు, మండల సమాఖ్య సమావేశాలు సక్రమంగా నిర్వర్తించాలన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు ఫెషియల్ రికగ్నైజేషన్, జియో ఫెన్సింగ్‌పై సక్రమంగా పని చేయాలన్నారు. మన డబ్బులు.. మన లెక్కలో కార్యక్రమంలో ప్రతి సభ్యులు డేటాను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నా రు. ఐదారు సంఘాలకు ఎన్యుమరేటర్‌ను గుర్తించి సంఘ సభ్యులకు సీసీ సమక్షంలో బయోమెట్రిక్ అథంటికేషన్ చేయాలన్నారు. ఇప్పటి వరకు 30,687 సంఘాలకు గాను 14,716 సంఘాలకు హౌస్ ఓల్డ్ లవ్లీ హుడ్ ప్లాన్ తయారు చేయడం జరిగిందన్నారు. డిసెంబర్ నాటికి రూ.1,043 కోట్ల్ల లక్ష్యం కాగా కాగా ఇప్పటి వరకు రూ.909.94 కోట్లు ప్రగతి సాధించామన్నారు. సీ్త్రనిధి, రికవరీ, ఎస్సీ, ఎస్టీ సభ్యులకు సున్నావడ్డీ, మహిళా రైతుల సంఘాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డీపీఎంతో పాటు 29 మండలాల ఏపీఎంలు, సీసీలు, ఎల్‌జీసీలు తదితరులు పాల్గొన్నారు.


