పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి
ఆత్మకూరు: పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి యం.చింతామణి సూచించారు. మంగళవారం ఆత్మకూరు ప్రభుత్వ బాలికల వసతిగృహంలో జూపాడుబంగ్లా, పగిడ్యాల, మిడుతూరు వసతి గృహాల విద్యార్థిని, విద్యార్థులకు ప్రేరణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులందరూ పట్టుదలతో చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేందుకు కష్టపడి చదవాలన్నారు. ప్రతి విద్యార్థికి పదో తరగతి తొలి మెట్టు అని, పదిలో మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆత్మకూరు తాలూకా సహాయ సాంఘిక సంక్షేమ అధికారి బి.అంకన్న, వివిధ వసతి గృహాల సంక్షేమ అధికారులు అనితమ్మ, సుధారాణి, విజయ్, మహేష్, రాజారావు, రాజు, రవిలు పాల్గొన్నారు.


