వ్యక్తిగత పరిశుభ్రత అవసరం
గోస్పాడు: ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో అవసరమని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సుదర్శన్‌బాబు అన్నారు. డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయం వద్ద అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో రుతు చక్ర పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్‌పోస్టర్లు విడుదల చేశారు. జిల్లా ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ అంకిరెడ్డి, కాంతరావునాయక్, డాక్టర్ శ్రీజ, సిబ్బంది గురుస్వామి, గుర్రప్ప, శివరాం, సరళగంగ, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఇంటర్ విద్యాధికారిగా శంకర్‌నాయక్
నంద్యాల(న్యూటౌన్): మిడుతూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న శంకర్‌నాయక్‌ను నంద్యాల జిల్లా ఇంటర్ విద్యాధికారిగా బదిలీ చేశారు. విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు బుధవారం శంకర్‌నాయక్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన విద్యను బోధించేందుకు అధ్యాపకులు కృషి చేయాలన్నారు. ప్రతి అధ్యాపకుడు అంకింత భావంతో పని చేయాలన్నారు. బాధ్యతలు చేపట్టిన ఆయనను కిందిస్థాయి సిబ్బంది అభినందించారు. ఇదిలా ఉండగా..జిల్లా ఇన్‌చార్జ్ ఇంటర్ విద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న సునీత గోస్పాడు జూనియర్ కళాశాల రెగ్యులర్ ప్రిన్సిపాల్‌గా వెళ్లారు.
ఘనంగా ఎన్టీఆర్ జయంతి
నంద్యాల(న్యూటౌన్): దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతిని బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ.. తెలుగు ఖ్యాతిని దేశ నలుమూల వ్యాప్తి చేయడానికి ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఎన్టీఆర్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్‌ఓ రాము నాయక్, పర్యాటక శాఖ అధికారి సత్యనారాయణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వ్యక్తిగత పరిశుభ్రత అవసరం
వ్యక్తిగత పరిశుభ్రత అవసరం


