అడవిలోకి వెళ్లని పులి
● నదీతీర ప్రాంత గ్రామాల్లో
అటవీ సిబ్బంది గస్తీ
ఆత్మకూరురూరల్: నాగార్జునసాగర్ – శ్రీశైలం పెద్దపులుల అభయారణ్య పరిధిలోని ఆత్మకూరు డివిజన్ సంగమేశ్వరం ప్రాంతం నుంచి వచ్చిన పెద్దపులి కృష్ణా నదిని ఈదుతూ దాటి తెలంగాణాలోని అమ్రాబాద్ పులుల అభయారణ్యం వైపు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ పులి నదికి ఆవల సోమశిల తదితర గ్రామాల పరిధిలోని పొలాల్లో తిరుగుతున్నదని గుర్తించిన ఇరు రాష్ట్రాల అటవీ అధికారులు నదికి అటు, ఇటు గస్తీ ముమ్మరం చేశారు. కొల్లాపూర్ అటవీ రేంజ్, ఆత్మకూరు రేంజ్ అధికారులు టీంగా ఏర్పడి నదికి ఇరువైపులా ఉన్న గ్రామాల పరిధిలో ప్రజలను హెచ్చరిస్తూ తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుపుతున్నారు. కొత్తపల్లె మండలంలోని జానాల, సిద్దేశ్వరం, కొల్లాపూర్ మండలం సోమశిల, మంచాలకట్ట,మల్లేశ్వరం తదితర గ్రామలలో గురువారం అధికారులు, సిబ్బంది పర్యటించారు.


