మోహినీ రూపుడు.. ప్రహ్లాదవరదుడు
దొర్నిపాడు: దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాదవరదస్వామి మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆధ్యయనోత్సవాల్లో భాగంగా దిగువ అహోబిలంలో గురువారం పగల్పత్తు శాత్తుమొరై కార్యక్రమం నిర్వహించారు. ముందుగా స్వామివారిని బంగారు ఆభరణాలు, వజ్రవైడూర్యాలతో మోహినీ అలంకారంలో అలంకరించారు. అనంతరం పల్లకీలో కొలువుంచి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. వేద ప్రబంధ పారాయణం చేసిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలన్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రామానుజన్, ఉభయదారులు వెంకటేష్, వనజ దంపతులు పాల్గొన్నారు.


