దక్షిణ భారత సైన్స్ ఫేర్‌కు జహీర్
ఆత్మకూరు: దక్షిణ భారత సైన్స్ ఫేర్‌కు ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి జహీర్ ఎంపిౖకై నట్లు హెచ్‌ఎం దేవానందన్ గురువారం తెలిపారు. విజయవాడలో ఈనెల 23 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి విద్యా ప్రదర్శనలో జహీర్ ఓవర్‌లోడ్ వార్నింగ్ అండ్ రిపోర్టింగ్ సిస్టం ఇన్ టూ వీలర్ (ద్విచక్ర వాహనాల్లో అధిక బరువును గుర్తించి హెచ్చరించే వ్యవస్థ) అనే నమూనాను ప్రదర్శించినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు జనవరి 19 నుంచి 26వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరగనున్న దక్షిణ భారత సైన్స్ ఫేర్‌లో ప్రదర్శించడానికి ఎంపికై ందన్నారు.


