పంచాయతీ కార్యాలయంలో తరగతి గదులు
రుద్రవరం మండలంలోని చందలూరు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని తరగతి గదులుగా మార్చు కున్నారు. కొద్ది నెలల నుంచి ఇక్కడే తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో వంద మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. వారికి ఐదుగురు ఉపాధ్యాయులు చదువులు చెబుతున్నారు. ప్రాథమిక పాఠశాలకు ఐదు గదులు అవసరం కాగా కేవలం మూడు మాత్రమే ఉన్నాయి. అవి కూడా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించినవే. మిగిలిన రెండు తరగతులకు గదులు లేక పంచాయతీ కార్యాలయాన్ని వాడుకుంటున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పాఠశాలలో అదనపు తరగతి గదులు నిర్మించి తగిన వసతులు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. – రుద్రవరం
పంచాయతీ కార్యాలయంలో
విద్యార్థులకు తరగతులు
నిర్వహిస్తున్న దృశ్యం
పంచాయతీ కార్యాలయంలో తరగతి గదులు


