
నేరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి
● జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా
నంద్యాల: జిల్లాలో నేరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆళ్లగడ్డ పోలీసు అధికారులతో ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ జిల్లాలో నేర నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రాధాన్యత క్రమంలో వివరించారు. పెండింగ్ కేసులు వాటి స్థితిగతులను క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్‌లో అప్‌లోడ్ చేసిన వాటి ఆధారంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సత్వరమే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే వారిపై రౌడీషీట్ ఓపెన్ చేయాలన్నారు. రహదారి ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డ్‌లు, క్యాట్ ఐస్, రోడ్డు బోర్డర్ లైన్స్ తదితర వాటిని ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా బోర్డర్, టోల్ గేట్‌లలో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ గంజాయి, మద్యం, పీడీఎస్ రైస్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలన్నారు. సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, శక్తి యప్, నేర నియంత్రణ శాంతిభద్రతల గురించి ప్రజలకు అవగాహన కల్పించాన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు, ఆళ్లగడ్డ డిఎస్పీ ప్రమోద్, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుకు దరఖాస్తు చేసుకోండి
కర్నూలు కల్చరల్: ఉమ్మడి కర్నూలు జిల్లాలో అర్హత కలిగిన విద్యార్థులు ఏపీపీజీసెట్–2025 ద్వా రా ఎంఏ ఎకనామిక్స్ కోర్సులో ప్రవేశానికి దరఖా స్తు చేసుకోవాలని రాయలసీమ యూనివర్సిటీ ఎకనామిక్స్ డిపార్ట్‌మెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్.శ్రీధర్ తెలిపారు. డిగ్రీలో బీఏ ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న వారితో పాటు డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులన్నారు. ఏపీపీజీసెట్ దరఖాస్తుకు మే 5వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు.