భక్త కోటి ప్రణమిల్లి..
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం అహోబిలం క్షేత్రం భక్తులతో పోటెత్తింది. గోవింద నామ స్మరణ మారుమోగింది. ఆధ్యాత్మిక శోభతో అహోబిలం ఇల వైకుంఠాన్ని తల పించింది. తెల్లవారుజామున 4 గంటల నుంచే స్వామి వారిని దర్శించుకోవడాని కి భక్తులు క్యూలలో బారులుదీరారు. శ్రీదేవి, భూదేవి సహిత శ్రీప్రహ్లాదవరద స్వామిని ఉత్తరద్వారంలో దర్శనం చేసుకున్నారు. ప్రహ్లాదవరద స్వామి ప్రత్యే కంగా అలంకరించిన గరుడవాహనంపై కొలువై ఆలయ మాఢవీధుల్లో విహరించారు. స్వామి వారిని కనులారా దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు.
– దొర్నిపాడు
భక్త కోటి ప్రణమిల్లి..
భక్త కోటి ప్రణమిల్లి..


