ఈవీఎం గోదాముల పరిశీలన
నంద్యాల(అర్బన్): భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా పట్టణంలోని టెక్కె మార్కెట్ యార్డ్‌లో ఈవీఎంలను భద్రపరిచిన గోదాములను జిల్లా కలెక్టర్ రాజకుమారి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాముల వద్ద ఏర్పాటు చేసిన సీళ్లను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రతకు సంబంధించి చేపట్టిన రక్షణ చర్యలు, భద్రతా ప్రమాణాలు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకా రం సక్రమంగా అమలవుతున్నాయా లేదా అన్న విషయాన్ని ఆమె సమగ్రంగా సమీక్షించా రు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్‌లో సంతకం చేసి తనిఖీలను అధికారికంగా నమోదు చేశా రు. ఈవీఎంల భద్రత అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, గోదాముల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టర్ వెంట డీఆర్‌ఓ రామునాయక్, ఆర్డీఓ విశ్వనాథ్, తహసీల్దార్ సత్య శ్రీనివాసులు, ఎలక్షన్ డీటీ మనో హర్, అలాగే రాజకీయ పార్టీల తరఫున ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి సయ్యద్ రియా జ్ బాషా, వైఎస్సార్‌సీపీ నుంచి సాయిరాం రెడ్డి, టీడీపీ నుంచి శివరామిరెడ్డి, బీజేపీ నుంచి చంద్రశేఖర్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి ప్రదీప్, సీపీఐ నుంచి నరసింహులు ఉన్నారు.
వన్యప్రాణులతో పంట నష్టం
వెలుగోడు: వన్యప్రాణుల కారణంగా పంట నష్టం ఎదుర్కొన్న రైతులకు అటవీ శాఖ నష్ట పరిహారం అందజేసింది. వెలుగోడు రేంజ్‌లో 36 మంది రైతులకు మొత్తం రూ.1,62,000 నష్టపరిహార చెక్కులు మంగళవారం పంపిణీ చేశారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎస్.జెడ్.ఏ. తాహెర్ చేతుల మీదుగా వెలుగోడు, నల్లకాల్వ గ్రామాలకు చెందిన రైతులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా తాహెర్ మాట్లాడుతూ.. వన్యప్రాణుల వల్ల పంట నష్టం జరిగితే వెంటనే అటవీ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు, వీఆర్వోలతో కలిసి తని ఖీ చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని తెలిపారు. వన్యప్రాణులను వేటాడటం లేదా హాని చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. వన్యప్రాణి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని, భవిష్యత్ తరాలకు జీవవైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిదన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ జయపాల్, అటవీ శాఖ అధికారులు గోపీ , టి.వెంకటేశ్వర్లు, రజాక్, బి.వెంకటేశ్వర్లు , గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి తప్పనిసరి
బొమ్మలసత్రం: న్యూ ఇయర్ వేడుకలకు తప్పనిసరిగా అనుమతి పొందాలని జిల్లా ఎస్పీ సునీల్‌షెరాన్ మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చ రించారు. జిల్లాలో 30 పోలీస్ యాక్టు అమలులో ఉన్నందున ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలన్నారు. రాత్రి 10 గంటల తర్వాత డీజే, మ్యూజిక్ సిస్టమ్‌లను వినియోగించరాదని సూచి ంచారు. వేడుకలు నిర్వహించే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉండాలన్నారు. వాహనాల తనిఖీలు ముమ్మరంగా చేపట్టనున్న నేపథ్యంలో అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. వేడుకల్లో అశ్లీల నృత్యాలతో పాటు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు.
బస్టాండ్‌లలో మౌలిక
వసతులు కల్పిస్తాం
పత్తికొండ: ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్టాండ్‌లలో మౌలిక వసతులు కల్పిస్తామని ఏపీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరక్టర్ ద్వారకా తిరుమలరావు అన్నారు. మంగళవారం ఆయన పత్తికొండ ఆర్టీసీ బస్టాండ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటరామయ్య, ఆర్టీసీ ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం బస్డాండ్‌లో సమస్యలను ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. పత్తికొండ–ఎమ్మిగనూర్‌కు వెళ్తున్న పల్లె వెలుగు బస్సును ఎక్కి మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. పత్తికొండ పర్యటనకు విచ్చేసిన ఆర్టీసీ ఎండీని ప్రజా సంఘాల నాయకులు కలిసి పత్తికొండ నుంచి ఇతర ప్రాంతాలకు నూతన సర్వీసులను ఏర్పాటు చేయాలని వినతిపత్రాలు అందచేశారు. విజయవాడ, ప్రొ ద్దుటూరుకు నూతన సర్వీసులు నడపాలన్నారు.
ఈవీఎం గోదాముల పరిశీలన


