చేతులెత్తి మొక్కుతూ.. మనసారా అభివాదం చేస్తూ.. చిరునవ్వులతో స్వాగతిస్తూ.. అభిమాన తరంగం ఉవ్వెత్తున ఎగిసింది. జగమంత కుటుంబం ఆత్మీయత పంచగా.. అడుగడుగునా ఆప్యాయత స్వాగత తోరణమైంది. | - | Sakshi
Sakshi News home page

చేతులెత్తి మొక్కుతూ.. మనసారా అభివాదం చేస్తూ.. చిరునవ్వులతో స్వాగతిస్తూ.. అభిమాన తరంగం ఉవ్వెత్తున ఎగిసింది. జగమంత కుటుంబం ఆత్మీయత పంచగా.. అడుగడుగునా ఆప్యాయత స్వాగత తోరణమైంది.

Apr 4 2025 1:32 AM | Updated on Apr 4 2025 1:32 AM

చేతుల

చేతులెత్తి మొక్కుతూ.. మనసారా అభివాదం చేస్తూ.. చిరునవ్వు

● మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు ● వివాహ వేడుకకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి ● అభిమానులతో కిటకిటలాడిన కన్వెన్షన్‌ హాలు ● పాల్గొన్న ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షులు, వైఎస్సార్‌సీపీ నేతలు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు భారీగా తరలి వచ్చిన ప్రజలు

కర్నూలు (టౌన్‌): మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ‘జై జగన్‌.. సీఎం..సీఎం’ అంటూ నినాదాలు చేశారు. మాజీ ముఖ్యమంత్రితో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. భారీగా అభిమానులు రావడంతో రోడ్లు కిక్కిరిసి పోయాయి. కుడా మాజీ చైర్మన్‌ కోట్ల హర్షవర్ధన్‌ రెడ్డి కుమార్తె వివాహ వేడుక గురువారం కర్నూలు నగర శివారులోని జీఆర్‌సీ కన్వెన్షన్‌ హాలులో నిర్వహించారు. వివాహ వేడుకకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. నూతన దంపతులు శ్రేయ, వివేకానంద విరూపాక్షిని ఆశీర్వదించా రు. వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రిని చూసేందుకు, సెల్ఫీ దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ప్రజలు భారీగా తరలి రావడంతో కన్వెన్షన్‌ హాలు కిక్కిరిసిపోయింది.

ఆప్యాయంగా పలకరించి..

తాడేపల్లి నుంచి కర్నూలు నగరంలోని మైపర్‌ మైదానం హెలిపాడ్‌కు చేరుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వైఎస్సార్‌సీపీ కర్నూలు, నంద్యాల జిల్లాఅధ్యక్షులు ఎస్వీ మోహన్‌రెడ్డి, కాటసాని రాంభూల్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, బూసినె విరూపాక్షి, ఎమ్మెల్సీ డాక్టర్‌ మధుసూదన్‌ స్వాగతం పలికారు. మాజీ ఎంపీలు బుట్టా రేణుక, పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్‌, సాయి ప్రసాద్‌రెడ్డి, కంగాటి శ్రీదేవి, ఎర్రకోట చెన్న కేశవరెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, కాటసాని రామిరెడ్డి, బిజేంద్రా రెడ్డి, శిల్పా రవికిషోర్‌ రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి, మేయర్‌ బీవై రామయ్య, పార్టీ నేతలు ఆదిమూలపు సతీష్‌, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, దార సుధీర్‌, పార్టీ రాష్ట్ర నాయకులు తెర్నేకల్‌ సురేంద్ర రెడ్డి, సుభాష్‌ చంద్రబోస్‌, విజయ మనోహారి, శశికళ, గాజుల శ్వేతారెడ్డి స్వాగతం పలికారు. పూలబోకేలు ఇచ్చి శాలువాలు కప్పారు. ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన వైఎస్సార్‌సీపీ నేతలను మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అప్యాయంగా పలకరించారు. ప్రతి ఒక్కరి యోగక్షేమాలు తెలుసుకున్నారు.

ఆత్మీయత.. అభిమానం

హెలిపాడ్‌కు భారీగా చేరుకున్న ప్రజలు ‘సీఎం.. సీఎం’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జొహరాపురం రోడ్డు జనంతో నిండిపోయింది. హెలిపాడు నుంచి అందరికీ అభివాదం చేసుకుంటూ కారులో జీఆర్‌సీ కన్వెన్షన్‌కు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బయలు దేరారు. అందరికీ అభివాదం చేశారు. జననేతను చూసేసరికి అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి పర్యటనలో ఆద్యంతం ఆత్మీయత, అభిమానం కనిపించింది.

అభివాదం చేస్తున్న

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

చేతులెత్తి మొక్కుతూ.. మనసారా అభివాదం చేస్తూ.. చిరునవ్వు1
1/5

చేతులెత్తి మొక్కుతూ.. మనసారా అభివాదం చేస్తూ.. చిరునవ్వు

చేతులెత్తి మొక్కుతూ.. మనసారా అభివాదం చేస్తూ.. చిరునవ్వు2
2/5

చేతులెత్తి మొక్కుతూ.. మనసారా అభివాదం చేస్తూ.. చిరునవ్వు

చేతులెత్తి మొక్కుతూ.. మనసారా అభివాదం చేస్తూ.. చిరునవ్వు3
3/5

చేతులెత్తి మొక్కుతూ.. మనసారా అభివాదం చేస్తూ.. చిరునవ్వు

చేతులెత్తి మొక్కుతూ.. మనసారా అభివాదం చేస్తూ.. చిరునవ్వు4
4/5

చేతులెత్తి మొక్కుతూ.. మనసారా అభివాదం చేస్తూ.. చిరునవ్వు

చేతులెత్తి మొక్కుతూ.. మనసారా అభివాదం చేస్తూ.. చిరునవ్వు5
5/5

చేతులెత్తి మొక్కుతూ.. మనసారా అభివాదం చేస్తూ.. చిరునవ్వు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement