జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిద్దాం | - | Sakshi
Sakshi News home page

జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిద్దాం

Mar 31 2025 11:21 AM | Updated on Mar 31 2025 11:21 AM

నంద్యాల: జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించి రాష్ట్రంలో అగ్రగామిగా నిలుపుదామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి, న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఉత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రులతో పాటు జిల్లా కలెక్టర్‌ రాజకుమారి, జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ తదితర ఉన్నతాధికారులు ఉగాది ఉత్సవాలను పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూజాది కార్యక్రమాలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు. అనంతరం పంచాంగ కర్తలు ప్రవీణ్‌ కుమార్‌ శర్మ, శివకుమార్‌ శర్మ ఉగాది పంచాంగ పఠనాన్ని వారు శ్రద్ధగా ఆలకించారు. షడ్రుచుల ఉగాది పచ్చడిని ఆస్వాదించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారులు, సిబ్బంది అంత కలసి ఒక కుటుంబంగా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం చూస్తే చాలా ఆనందంగా ఉందన్నారు. జిల్లాలో సహజ వనరులకు కొదవలేదన్నారు. జిల్లా కలెక్టర్‌ రాజకుమారి మాట్లాడుతూ విశ్వావసు నామ సంవత్సరం విశ్వాన్నే వశం చేసుకున్న శ్రీమన్నారాయణుడే అన్నారు. అంటే ధనం... యువత అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు జిల్లా సుసంపన్నంగా ఉండాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నారు. అనంతరం కవి సమ్మేళనం నిర్వహించిన గెలివి సహదేవుడు, గ్రందే నరేంద్ర, గంగుల నాగరాజు, ధోనిపూడి నరేష్‌, నీలం వెంకటేశ్వర్లు, కొప్పుల ప్రసాద్‌, నీలకంఠమాచారి, మహబూబ్‌ బాషా, అన్నం శ్రీనివాసరెడ్డి, శేషఫణి, కిశోర్‌ కుమార్‌, రత్నలక్ష్మి, మద్దిలేటి, తొగట సురేష్‌ బాబులను కలెక్టర్‌, మంత్రులు అభినందిస్తూ శాలువలు, వివిధ రకాల ఫలాలతో ఘనంగా సత్కరించారు. అలాగే విశిష్ట సేవలందించిన వ్యవసాయ రంగంలో పగిడాల వెంకటేశ్వర్లు, విద్యారంగంలో వైష్ణవ వెంకటరమణ, పరిశ్రమల రంగంలో గెలివి రామకృష్ణ, క్రీడారంగంలో ఎం.మల్లికార్జున, సామా జిక సేవా రంగంలో ఎస్‌.నాగశేషులకు ఉగాది పురస్కారాలు అందజేశారు. సాంస్కృతిక కార్యక్ర మాలు ప్రదర్శించిన విద్యార్థులను పలువురిని అలరించాయి. బాలభవన్‌ విద్యార్థులను మంత్రి బీసీ నగదు బహుమతితో అభినందించారు. వేడుకల్లో డీఆర్‌ఓ రాము నాయక్‌, ఆర్‌డీఓ విశ్వనాథ్‌, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

మంత్రులు బీసీ, ఫరూక్‌

వైభవంగా ఉగాది వేడుకలు

పలువురికి ఉగాది పురస్కారాలు

అందజేత

జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిద్దాం1
1/1

జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిద్దాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement