ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి

Nov 21 2026 2:56 AM | Updated on Nov 21 2026 2:56 AM

మౌలిక సదుపాయాలు కల్పించాలి

నల్లగొండ : వానాకాలం ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో 2026–27 వానాకాలం ధాన్యం సేకరణపై సంబంధిత శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం విక్రయించిన రైతులకు ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైస్‌ మిల్లర్లు వెంటనే బ్యాంకు గ్యారంటీలను సమర్పించాలని సూచించారు. తహసీల్దార్లు తమ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైస్‌ మిల్లులను క్రమం తప్పకుండా సందర్శించి, కొనుగోళ్ల ప్రక్రియను పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జె. శ్రీనివాస్‌, శిక్షణ సహాయ కలెక్టర్‌ శ్రీకాంత్‌రెడ్డి, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్‌ రాంపతి నాయక్‌, డీఎస్‌ఓ వెంకటేశం, జిల్లా వ్యవసాయ అధికారి వినోద్‌కుమార్‌, డీసీఓ మమత, మార్కెటింగ్‌ ఏడీ ఛాయాదేవి తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ : నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించి వారు ఆర్థికంగా ఎదిగేలా చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘రాజీవ్‌ యువ వికాసం’ పథకం అమలు కావడం లేదు. సొంతంగా వ్యాపారాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం రుణాలు, సబ్సిడీ అందిస్తుందని ఆశించి జిల్లా వ్యాప్తంగా 79,495 మంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ పథకం అమలుపై ఎలాంటి సష్టతా రావడం లేదు. మరోవైపు ఈ నెల 19 నుంచి పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా క్షేత్రస్థాయిలో మాత్రం కదలిక లేదు. ప్రభుత్వ మార్గదర్శకాలు అందిన తర్వాతే తదుపరి చర్యలు చేపడతామని అధికారులు చెబుతుండటంతో దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు.

యూనిట్‌ వ్యయాన్ని బట్టి సబ్సిడీ..

ఈ పథకం కింద యూనిట్‌ వ్యయాన్ని బట్టి ప్రభుత్వం సబ్సిడీ అందించనున్నట్లు ప్రకటించింది. రూ.50 వేల వరకు యూనిట్‌కు 100 శాతం, రూ.50,001 నుంచి రూ.లక్ష వరకు 90 శాతం, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 80 శాతం, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు 70 శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లు ప్రతిపాదించింది. మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణం ద్వారా సమకూర్చుకునే వెసులుబాటు కల్పించనున్నట్లు వెల్లడించింది. ఈ ఆర్థిక వెసులుబాటుతో చిన్న వ్యాపారాలు ప్రారంభించి కుటుంబానికి ఆసరాగా నిలవవచ్చని చాలామంది నిరుద్యోగులు భావించారు. అయితే పథకం అమలులో జాప్యం కారణంగా వారి ఆశలు నెరవేరడం లేదు.

జూలై నుంచి ఎదురుచూపులే..

ప్రభుత్వం జూలై నెలలో రుణాలు, సబ్సిడీ అందించనున్నట్లు ప్రకటించడంతో నిరుద్యోగ యువత తమకు అనువైన స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఆరు కార్పొరేషన్ల పరిధిలో దరఖాస్తులు సమర్పించింది. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన తర్వాత అర్హుల ఎంపిక, ఆర్థిక సాయం మంజూరు ప్రక్రియ వేగంగా సాగుతుందని ఆశించారు. కానీ నెలలు గడుస్తున్నా ఆశించిన పురోగతి కనిపించడం లేదు.

మార్గదర్శకాల కోసం ఎదురుచూపులు..

ప్రభుత్వం నవంబర్‌ 19 నుంచి పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ సంబంధిత శాఖలకు సమగ్ర మార్గదర్శకాలు అందాల్సి ఉంది. లబ్ధిదా రుల ఎంపిక ఏ ప్రాతిపదికన చేపట్టాలి? దరఖాస్తులను ఎలా పరిశీలించాలి? యూనిట్ల మంజూరు, బ్యాంకు రుణాల ప్రక్రియ ఎలా ఉండాలి? సబ్సిడీ నిధులు ఎప్పుడు విడుదల చేయాలి? వంటి అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వ మార్గదర్శకాలు అందిన తర్వాత వాటి ప్రకారం తదుపరి చర్యలు చేపడతామని అధికారులు పేర్కొంటున్నారు.

కార్యాచరణ ప్రకటించాలి..

దరఖాస్తుల స్వీకరణతోనే ప్రభుత్వం బాధ్యత ముగిసినట్లు కాదని, అర్హులకు ఆర్థిక సాయం అందించినప్పుడే పథకం లక్ష్యం నెరవేరుతుందని నిరుద్యోగులు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం సమగ్ర మార్గదర్శకాలు విడుదల చేసి, దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక, రుణాల మంజూరు, సబ్సిడీ విడుదలకు సంబంధించి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరుతున్నారు.

దరఖాస్తులకే పరిమితం.. అమలు శూన్యం

ఫ ఆరు కార్పొరేషన్ల పరిధిలో 79,495 దరఖాస్తులు

ఫ మార్గదర్శకాలు విడుదల చేయక నిలిచిన ప్రక్రియ

కలెక్టర్‌ చంద్రశేఖర్‌

నల్లగొండ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాలలు, హాస్టళ్లలో వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేలా కమ్యూనిటీ సోక్‌ పిట్స్‌, రూఫ్‌టాప్‌ రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ నిర్మాణాలు చేపట్టాలన్నారు. వీబీజీ రామ్‌ జీ పథకం కింద మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులు వచ్చే అవకాశం ఉన్నందున పాఠశాలలు, హాస్టళ్లలో అంతర్గత రహదారులు, పాఠశాలలకు అప్రోచ్‌ రోడ్ల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఆధార్‌, కుల, నివాస తదితర ధ్రువపత్రాలు జారీ చేసేందుకు అవసరమైన దరఖాస్తులను ఈ నెల 23వ తేదీలోగా సమర్పించేలా చూడాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ ప్రేమ్‌కరణ్‌ రెడ్డి, ట్రైనీ కలెక్టర్‌ శ్రీకాంత్‌రెడ్డి, డీఈఓ సుశీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement