నల్లగొండ : ఇందిరమ్మ కుటుంబ బీమాతో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతుందని నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య అన్నారు. శుక్రవారం నల్లగొండలోని 32వ డివిజన్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పేద కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అండగా ఉంటుందన్నారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు డివిజన్ల వారీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమీర్, మున్సిపల్ కమిషనర్ శ్రీజరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు మారగోని నవీన్‌గౌడ్, ఏదుళ్ల శ్రీధర్‌రెడ్డి, అల్లి సుభాష్, ఇబ్రహీం, సమద్, మహమ్మద్ ఇర్ఫాన్ అహ్మద్, బోయినపల్లి శ్రీనివాస్, ఖలీల్, గోగుల గణేష్, ఖయ్యూం బేగ్, ఎడ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.


