ఎల్‌నినో కారణంగా దేశవ్యాప్తంగా ఎరువులకు డిమాండ్ తగ్గింది. దీంతో ధరలు కూడా తగ్గాయి.
- 8లో
వైజాగ్ కాలనీలో
‘ఎకో టూరిజం’
చందంపేట: నేరెడుగొమ్ము మండలంలోని వైజాగ్ కాలనీ టూరిజం ప్రాంతాన్ని శుక్రవారం రాష్ట్ర టూరిజం అధికారి శ్రీహారెడ్డి, జిల్లా టూరిజం అధికారి అక్బరొద్దీన్ సందర్శించారు. ఈ ప్రాంతంలో ఎకో టూరిజం హబ్, స్టే హోమ్‌ల ఏర్పాటుకు గల సాధ్యాసాధ్యాలను వారు పరిశీలించి, స్థానికుల అభిప్రాయాలను సేకరించారు. ఇక్కడ ఎకో టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బిక్కునాయక్ స్థానిక సర్పంచ్ దూడ సత్యవతి, గన్నునాయక్, రఘు, బాబురాం, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.


