ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు

Nov 21 2026 2:56 AM | Updated on Nov 21 2026 2:56 AM

రామగిరి (నల్లగొండ) : విద్యార్థుల్లో పఠనాసక్తిని, సృజనాత్మకతను పెంపొందించే లక్ష్యంతో నల్లగొండ జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వారం రోజుల పాటు జరిగిన నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రతీక్‌ ఫౌండేషన్‌ సీఈఓ గోనారెడ్డి, గ్రంథాలయ సెక్రటరీ బాలమ్మ, గాదె వినోద్‌రెడ్డి, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, లైబ్రేరియన్‌ డాక్టర్‌ ఎస్‌.రాజారాం, ప్రిన్సిపాల్‌ యూసఫ్‌ దీన్‌, ఎస్‌.వేణుగోపాలచార్యులు, శ్రవణ్‌కుమార్‌, కుసుమశ్రీ, రాజేష్‌, శ్రీనివాస్‌, సృజనరావు, మల్లేష్‌, అనిత, యామిని, శారద, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలోని మహిళా

కాంగ్రెస్‌ కమిటీల రద్దు

నల్లగొండ : జిల్లాలోని మహిళా కాంగ్రెస్‌ కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళా కాంగ్రెస్‌ జిల్లా నూతన అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు స్వర్ణ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రస్తుత కమిటీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. త్వరలోనే నూతన కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

భూ చట్టాలపై

అవగాహన అవసరం

● రైతు కమిషన్‌ సభ్యుడు సునీల్‌కుమార్‌

నల్లగొండ టూటౌన్‌ : భూమి హక్కుల పరిరక్షణ, భూ రికార్డుల పారదర్శకత, రెవెన్యూ పరిపాలనలో చట్టాల పాత్రపై అవగాహన కలిగి ఉండటం న్యాయ విద్యార్థులకు ఎంతో అవసరమని రైతు కమిషన్‌ సభ్యుడు ఎం.సునీల్‌ కుమార్‌ (భూమి సునీల్‌) అన్నారు. ఆయన శుక్రవారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భూమికి సంబంధించిన సమస్యలను చట్టపరంగా విశ్లేషించి, న్యాయ పరిష్కార మార్గాలను గుర్తించే పరిజ్ఞానం భవిష్యత్‌లో న్యాయవాదులుగా ఎదిగే విద్యార్థులకు కీలకమన్నారు. భూమి అనేది కేవలం ఆస్తి మాత్రమే కాదని, రైతుల జీవనోపాధి, కుటుంబాల ఆర్థిక భద్రత, సామాజిక స్థిరత్వంతో ముడిపడి ఉన్న కీలకమైన అంశమని వివరించారు. భూ వివాదాల ను తీర్చేందుకు సంబంధిత పత్రాలు, రెవెన్యూ రికార్డులు, చట్టపరమైన నిబంధనలు, వాస్తవ పరిస్థితులను సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమంలో లా కాలేజీ ప్రిన్సిపాల్‌ ఆకుల రవి, సంజీవరెడ్డి, బి.సునీత, ఆర్‌.ధనలక్ష్మి, పి.నాగేంద్రగౌడ్‌, డి.హేమంత్‌, ప్రశాంత్‌ పాల్గొన్నారు.

రాజగోపాల్‌రెడ్డికి

క్షమాపణ చెప్పాలి

నకిరేకల్‌ : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్‌ చేసిన అనుచిత వాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్‌, కట్టంగూరు మాజీ జెడ్పీటీసీ సుంకరబోయిన నర్సింహయాదవ్‌, చిట్యాల మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం నకిరేకల్‌లోని శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ నివాసంలో వారు విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో లేని సమయంలో పార్టీకి అండగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేసే నైతి హక్కు పున్న కై లాష్‌కు లేదన్నారు. సమావేశంలో నాయకులు శేరి చత్రపతి, వల్లపు శ్రీనివాస్‌రెడ్డి, నాగంపల్లి శ్యాం, సైదులు, ముక్కాముల శేఖర్‌, కోట పుల్లయ్య, మాద లింగస్వామిగౌడ్‌, యాదగిరి, రంగు వీరయ్య, వెంకటేష్‌, శ్రీను, సైదులు, నవీన్‌, యాకోబ్‌, చారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement