రామన్నపేట : విద్యార్థులు చరిత్రను అధ్యయనం చేయాలని ప్రముఖ సాహితీవేత్త తెలుగుశాఖ అధ్యక్షుడు డాక్టర్ తండు కృష్ణకౌండిన్య అన్నారు. రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు గురువారం విష్ణుకుండినుల రాజధానిగా వెలుగొందిన ఇంద్రపాలనగరంలోని చారిత్రక ప్రదేశాలను, పురాతన శివాలయాన్ని సందర్శించారు. ఇంద్రపాలనగరం చరిత్రను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కో ఆర్డినేటర్ డాక్టర్ డి.కిషన్ పరిపాలనా అధికారి జి.కరుణాకర్ అధ్యాపకులు అమర్, నరేష్, రాంబాబు, కిరణ్ పాల్గొన్నారు.


