మూసీకి కొనసాగుతున్న వరద | - | Sakshi
Sakshi News home page

మూసీకి కొనసాగుతున్న వరద

Sep 25 2026 2:05 AM | Updated on Sep 25 2026 2:05 AM

కేతేపల్లి : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. మూసీ సమీపంలో ఉన్న శాలిగౌరారం, అర్వపల్లి, జాజిరెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో గురువారం ఉదయం ఎగువ నుంచి మూసీకి 5వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. మూసీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు సాయంత్రం వరకు తగ్గుముఖం పట్టడంతో మూసీకి వస్తున్న ఇన్‌ఫ్లో 2,050 క్యూసెక్కులకు తగ్గిపోయింది. మూసీ గరిష్ట నీటిమట్టం సామర్థ్యం 645 అడుగులు కాగా ప్రస్తుతం ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోతో గురువారం సాయంత్రానికి 641.20 అడుగుల వరకు చేరుకుంది. మూసీ ఆయకట్టులో వానాకాలం పంటల సాగు కోసం మూసీ కుడి, ఎడమ కాల్వలకు 295 క్యూసెక్కులు చొప్పున మొత్తం 590 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. లీకేజీ, సీపేజీ, ఆవిరి రూపంలో 30 క్యూసెక్కుల నీరువృథా అవుతుంది. మూసీ రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.35 టీఎంసీల నీరు నిల్వ ఉందని మూసీ ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement