నేడు జిల్లాకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ రాక | - | Sakshi
Sakshi News home page

నేడు జిల్లాకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ రాక

Sep 25 2026 2:05 AM | Updated on Sep 25 2026 2:05 AM

నల్లగొండ : రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య, కమిటీ సభ్యులు ఈనెల 25న జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కమిషన్‌ సభ్యులు శుక్రవారం ఉదయం 10 గంటలకు కొండమల్లేపల్లి మండలం, దంజిలాల్‌తండాలో ఉన్న గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలతోపాటు 10.30 గంటలకు పిల్యాతండా, 11 గంటలకు గుడితండా, మధ్యాహ్నం 12.30 గంటలకు దేవరకొండలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శిస్తారని పేర్కొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కనగల్‌ మండలం రేగట్టే గ్రామానికి చేరుకొంటారని, భోజనం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా నుంచి తిరిగి హైదరాబాద్‌ వెళతారని పేర్కొన్నారు.

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌కు గురుకుల విద్యార్థులు

హాలియా : హన్మకొండలో ఈ నెల 26, 27 తేదీల్లో నిర్వహించనున్న 12వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు నాగార్జునసాగర్‌ బీసీ గురుకుల పాఠశాల, కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. నల్లగొండ జిల్లా అథ్లెటిక్స్‌ జట్టు ఎంపికల్లో భాగంగా స్థానిక మేకల అభినవ్‌ స్టేడియంలో నిర్వహించిన సెలక్షన్స్‌లో గురుకులానికి చెందిన 17మంది విద్యార్థులు వివిధ విభాగాల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారు. వీరిలో అండర్‌–18 విభాగం నుంచి ద్వితీయ సంవత్సరం విద్యార్థి దినేష్‌ (లాంగ్‌జంప్‌, జావెలిన్‌ త్రో), ప్రథమ సంవత్సరం విద్యార్థులు నిరంజన్‌ (షాట్‌ఫుట్‌), తేజ (జావెలిన్‌ త్రో) ఎంపికయ్యారు. అలాగే అండర్‌–16 విభాగంలో తొమ్మిదో తరగతి విద్యార్థి సంపత్‌ (హైజంప్‌), తనుష్‌ (జావెలిన్‌ త్రో).. అండర్‌–14 విభాగంలో ఎనిమిదో తరగతి విద్యార్థి నిఖిల్‌సింగ్‌ (ట్రైయాథ్లాన్‌–ఏ) రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరచి పాఠశాలకు, జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని ప్రిన్సిపాల్‌ రవికుమార్‌, కళాశాల సిబ్బంది ఆకాంక్షించారు.

గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడిగా రమేష్‌

రామగిరి(నల్లగొండ) : గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా నల్లగొండ మండలం చందనపల్లికి చెందిన సురిగి రమేష్‌గౌడ్‌ నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ నగర్‌ గల ఆ సంఘం కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు గట్టు రామచంద్రయ్యగౌడ్‌ చేతులమీదుగా రమేష్‌గౌడ్‌ నియామక పత్రం అందుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు గుండాల మల్లేష్‌ గౌడ్‌, శంకర్‌, పెద్ది వెంకటయ్య, సైదులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement