నల్లగొండ: న్యాయవాదులకు రిటైర్మెంట్, డెత్ బెనిఫిట్స్ రూ.25 లక్షలకు పెంచడంతోపాటు జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.10 వేల స్టైఫండ్ అందించి ఆదుకోవాలని ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు) జిల్లా కార్యదర్శి అనంతుల శంకరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐలు జాతీయ కౌన్సిల్ పిలుపు మేరకు బుధవారం నల్లగొండ కోర్టు కాంప్లెక్స్ ఎదుట న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శంకరయ్య మాట్లాడుతూ కేంద్ర న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం–2001ను తక్షణమే సవరించాలన్నారు. న్యాయవాదుల వైద్య సహాయం నిమిత్తం రూ.5 లక్షలు మంజూరు చేయాలన్నారు. ధర్నాలో బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.సతీష్ కుమార్, బి.అశోక్ కుమార్, సీనియర్ న్యాయవాదులు జి.వెంకటేశ్వర్లు, పి.శ్రీనివాస్‌రెడ్డి, ఐలు జిల్లా నాయకులు పి.బ్రహ్మచారి, సత్తయ్య, యాదయ్య, వంశీకృష్ణ, నాగిరెడ్డి, దుర్గాప్రసాద్, సింగం శ్రీనివాస్, ఠాగూర్, లాలయ్య, జమీల్, మసీదున్, బి.గణేష్, సంపత్ కుమార్, జి.కిషోర్ కుమార్, డి.నర్సాజి, పోలగోని శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


