భక్తులు నీటిలోకి దిగకుండా చూడాలి : కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

భక్తులు నీటిలోకి దిగకుండా చూడాలి : కలెక్టర్‌

Sep 24 2026 2:18 AM | Updated on Sep 24 2026 2:18 AM

నార్కట్‌పల్లి, చిట్యాల : వినాయక విగ్రహాల నిమజ్జనం సమయంలో భక్తులు నీటిలోకి దిగకుండా చూడాలని కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ అన్నారు. నార్కట్‌పల్లి మండలం ఏపీ లింగోటం చెరువు, చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులోని పెద్ద చెరువు వద్ద వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్దేశించిన చోటనే విగ్రహాలు నిమజ్జనం చేయాలన్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట నార్కట్‌పల్లి తహసీల్దార్‌ వేణుగోపాల్‌రావు, ఎంపీడీఓ ఉమేష్‌, చిట్యాల ఎంపీడీఓ పాండు, నార్కట్‌పల్లి ఏపీఓ సుధాకర్‌, చిట్యాల డీటీ విజయ, ఎంపీఓ కోటేష్‌, ఏపీ లింగోటం సర్పంచ్‌ పనస సరోజవెంకటయ్య, ఉప సర్పంచ్‌ కొరివి శంకర్‌, ఆర్‌ఐలు యాదయ్య, భవాని ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement