నిమజ్జనానికి నీళ్లు అందించలేని ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

నిమజ్జనానికి నీళ్లు అందించలేని ప్రభుత్వం

Sep 24 2026 2:18 AM | Updated on Sep 24 2026 2:18 AM

వేములపల్లి : గణేష్‌ విగ్రహాల నిమజ్జనానికి కనీసం నీరు అందించలేని దుస్థితిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉందని ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి అన్నారు. బుధవారం వేములపల్లి మండల కేంద్రంలోని సాగర్‌ ఎడమ కాల్వ వద్ద గణేష్‌ నిమజ్జన ప్రదేశాన్ని మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావుతో కలిసి పరిశీలించారు. అనంతరం కాల్వలోకి దిగి నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. గణేష్‌ నిమజ్జనం కోసం నీటిని అందుబాటులో ఉంచాల్సిన అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతులు, ప్రజల పట్ల, చివరికి దేవుడి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పుట్టల సందీప్‌కుమార్‌, నాయకులు పాలుట్ల బాబయ్య, చిర్ర మల్లయ్యయాదవ్‌, నిమ్మల నవీన్‌రెడ్డి, నాగవెల్లి శంకర్‌, యాదగిరి, శేఖర్‌రెడ్డి, కోటయ్య పాల్గొన్నారు.

ఏర్పాట్లలో ప్రభుత్వం విఫలం : కంచర్ల

నల్లగొండ : వినాయక నిమజ్జన ఏర్పాట్లలో ప్రభుత్వం, స్థానిక అధికారులు పూర్తిగా విఫలమయ్యాయని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన నల్లగొండలోని పాతబస్తీలోని మొదటి విగ్రహం వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పోలీసులు, అధికార యంత్రాంగంతీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమజ్జన ప్రాంతాలకు నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అత్యంత ప్రాధాన్యత ఉన్న పాతబస్తీ మొదటి విగ్రహ విశిష్టతను తగ్గించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ చీర పంకజ్‌యాదవ్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, అభిమన్యు శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు భువనగిరి దేవేందర్‌, మండల అధ్యక్షులు పల్‌రెడ్డి రవీందర్‌రెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఫ ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement