సందర్శనతోనే విజ్ఞానం | - | Sakshi
Sakshi News home page

సందర్శనతోనే విజ్ఞానం

Sep 23 2026 2:12 AM | Updated on Sep 23 2026 2:12 AM

వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు నిమజ్జన ప్రాంతాలు ఇవే.. నీటిని నిలివేతతో భక్తుల ఆందోళన

న్యూస్‌రీల్‌

పర్యాటక ప్రదేశాలను సందర్శించడం వల్ల విద్యార్థులకు విజ్ఞానం కలుగుతుందని ప్రేమ్‌కరణ్‌ రెడ్డి అన్నారు.

ఫార్మర్‌ రిజిస్ట్రీ చేయించుకోవాలి

రైతులు ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరిగా చేయించుకోవాలని డీఏఓ, ఏఓలు సూచించారు.

- 8లో

బుధవారం శ్రీ 23 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

నల్లగొండ టూటౌన్‌ : నవరాత్రులు పూర్తికావడంతో గణపయ్య నిమజ్జలనానికి వేళయింది. ఇందుకోసం జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లా వ్యాప్తంగా చెరువు, కాల్వల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఆదేశాల మేరకు గణపయ్యల నిమజ్జనం కోసం నాగార్జునసాగర్‌ ఎడమకాల్వకు నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. నల్లగొండ పట్టణంలోని 10 ఫీట్లలోపు విగ్రహాలను ఆర్జాలబావి వల్లభరావు చెరువులో.. అంతకంటే ఎత్తున్న విగ్రహాలను వేములపల్లి వద్ద సాగర్‌ ఎడమకాల్వలో నిమజ్జనం చేయనున్నారు.. 15 ఫీట్లలోపు వరకు ఉన్న విగ్రహాలు 14వ మైలురాయి వద్ద నిమజ్జనం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అందుకు సంబంధించిన రూట్‌ మ్యాప్‌ను పోలీస్‌ యంత్రాంగం ఖరారు చేసింది.

ఒకటో నెంబర్‌ విగ్రహం నుంచి శోభాయాత్ర..

నీలగిరి నగరంలోని పాతబస్తీ హనుమాన్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఒకటో నెంబర్‌ విగ్రహం వద్ద బుధవారం శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్ర ప్రారంభిస్తారు. పాతబస్తీ నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌, రాష్ట్రపతి రోడ్‌, పెద్ద గడియారం సెంటర్‌కు చేరుకుంటుంది. నగరంలోని అన్ని కాలనీల పెద్ద విగ్రహాల వాహనాలు అన్ని ఇక్కడికి వస్తాయి. గడియారం సెంటర్‌ నుంచి రామగిరి, సావర్కర్‌నగర్‌, పానగల్‌ ఫ్‌లైఓవర్‌ బ్రిడ్జి వరకు శోభాయాత్ర నిర్వహించి అక్కడి నుంచి పెద్ద విగ్రహాలు వేములపల్లి ఎడమకాల్వ వద్దకు, చిన్న విగ్రహాలు వల్లభరావు చెరువు వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం చేయనున్నారు. ఇప్పటికే నిమజ్జనం చేసే ప్రాంతాల్లో భారీ కేడ్లు, లైటింగ్‌ ఏర్పాటు చేసి క్రేన్‌లను అందుబాటులో ఉంచారు.

ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌

నల్లగొండ : గణేష్‌ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్‌ శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 6,184 గణేష్‌ విగ్రహాల నిమజ్జనానికి సుమారు వెయ్యి మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ తెలిపారు.

డీజేలు.. బాణాసంచాకు నో..

శోభాయాత్రలో డీజేలు, బాణాసంచాకు అనుమతి లేదు. మద్యం సేవించి వాహనాలు నడిపితే తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవు. ‘జీరో యాక్సిడెంట్‌–జీరో ఇన్సిడెంట్‌’ లక్ష్యంతో నిమజ్జన కార్యక్రమాన్ని సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టారు.

నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

పట్టణ సమీపంలోని వల్లభరావు చెరువు వద్ద గణేష్‌ నిమజ్జన ఏర్పాట్లను కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ మంగళవారం రాత్రి పరిశీలించారు. నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని కలెక్టర్‌ ఆదేశించారు. వారి వెంట ఆర్డీఓ అశోక్‌రెడ్డి, డీఎస్పీ శివరామిరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ వంశీకృష్ణ ఉన్నారు.

10 అడుగుల వరకు

ఉన్న విగ్రహాలు ఈ రూట్లో వెళ్తాయి

నల్లగొండలోని వల్లభరావు చెరువు వద్ద ఏర్పాటు చేసిన లైటింగ్‌

వల్లభరావు చెరువు, భీమసముద్రం, 14వ మైలు, వేములపల్లి సాగర్‌ కెనాల్‌, మిర్యాలగూడ, వాడపల్లి, నాగార్జునసాగర్‌, ఎడమకాలువ కొత్త బ్రిడ్జి, దయ్యాలగండి, అడవిదేవులపల్లి, దేవరకొండ కొండబీమనపల్లి, డిండి, పెద్దమునిగల్‌ సాగర్‌ బ్యాక్‌వాటర్‌ ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు, పికెట్లు, ఫ్లడ్‌లైట్లు, క్రేన్లు ఏర్పాటు చేశారు. గజ ఈతగాళ్లను కూడా అందుబాటులో ఉంచారు.

నిమజ్జనం కోసం ఎడమకాల్వకు నీరు విడుదల

హలియా : నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వకు అధికారులు సోమవారం నీటిని నిలుపుదల చేయడంతో గణేష్‌ నిమజ్జనానికి పెద్ద ఆటకంగా మారింది. ఏటా అనుముల మండలంలోని అలీనగర్‌ (14వ మైలు రాయి) వద్ద సాగర్‌ ఎడమ కాలువలో నిమజ్జనం చేస్తుంటారు. ఈ ఏడాది కూడా గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులు గణేష్‌ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు సిద్ధమైయ్యారు. అందుకు అనుగుణంగా అధికారులు కూడా సాగర్‌ ఎడమకాల్వ వద్ద ఏర్పాట్లు చేశారు. భారీ విగ్రహాలను ఎడమ కాల్వలో నిమజ్జనం చేసేందుకు క్రేన్లను తీసుకొచ్చారు. కానీ ఎడమ కాల్వకు సోమవారం రాత్రి నీటిని నిలిపి వేయడంతో గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. కానీ.. మంత్రి, కలెక్టర్‌ ఆదేశాలతో నీరు విడుదల చేస్తారని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.

నల్లగొండలోని పెద్ద విగ్రహాలు వేములపల్లికి.. 10 ఫీట్లలోపువి వల్లభరావు చెరువుకు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement