భూసేకరణ వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

భూసేకరణ వేగవంతం చేయాలి

Sep 23 2026 2:06 AM | Updated on Sep 23 2026 2:06 AM

మర్రిగూడ (చింతపల్లి) : డిండి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న చింతపల్లి రిజర్వాయర్‌ భూసేకరణ పనులతో పాటు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేయాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్‌ బాలునాయక్‌ అధికారులను ఆదేశించారు. దేవరకొండలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌, జిల్లా ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌రెడ్డి, భూసేకరణ, రెవెన్యూ అధికారులతో పాటు భూములు కోల్పోతున్న చింతపల్లి, నసర్లపల్లి, మల్లారెడ్డిపల్లి గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అందులో భాగంగా డిండి ప్రాజెక్టులో కీలకమైన చింతపల్లి రిజర్వాయర్‌ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం కలెక్టర్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. చింతపల్లి రిజర్వాయర్‌ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ పురోగతి, రైతులకు పరిహారం చెల్లింపు తదితర వివరాలను సమావేశంలో వివరించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌, దేవరకొండ సబ్‌ కలెక్టర్‌ కరోలిన్‌ చింగ్‌థియాన్‌ మావి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు వనజారాణి, లీల, చింతపల్లి తహసీల్దార్‌ విజయలక్ష్మి, ప్రాజెక్టు ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

ఫ ఎమ్మెల్యే నేనావత్‌ బాలునాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement