నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్‌లో విదేశీ బౌద్ధ భిక్షువుల బృందం శనివారం భిక్షాటన (పిండపాత) చేసింది. కొన్నిరోజులుగా థాయిలాండ్, కంబోడియా దేశాలకు చెందిన బౌద్ధ భిక్షువుల బృందం వర్షావాస కార్యక్రమంలో భాగంగా బుద్ధవనంలో ఆవాసం ఏర్పాటు చేసుకుని ఉంటోంది. వారి దిన చర్యలో భాగంగా నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్‌కాలనీ, పైలాన్ కాలనీ వీధుల్లో భిక్షాటన చేస్తున్నారు. ఈ సందర్భంగా బౌద్ధ బిక్షువులను స్థానికులు స్వయంగా తమ ఇళ్లకు ఆహ్వానించి ఆహార పదార్థాలు అందజేస్తున్నారు. వీరి వెంట బుద్ధవనం సిబ్బంది ఉన్నారు.


