రామగిరి (నల్లగొండ) : రామగిరి ముత్యాలమ్మ అమ్మవారి రథయాత్ర శనివారం రాత్రి వైభవంగా సాగింది. మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, కార్పొరేటర్ అబ్బగోని కవిత రమేష్‌గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ బుర్రి చైతన్య మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. రథయాత్రలో కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఎలిజాల అంజయ్య, మునాస్ వెంకన్న తదితరులున్నారు.


