దేవరకొండ : దేవరకొండ సబ్ కలెక్టర్‌గా కరోలిన్ చింగ్ తియాన్‌మావి సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. మొన్నటి వరకు ఇక్కడ ఆర్డీఓగా పని చేసిన పద్మప్రియ బదిలీ అయ్యారు. కాగా దేవరకొండ ఆర్డీఓ కార్యాలయానికి గతంలోనే సబ్ కలెక్టర్ హోదా కల్పించారు. ప్రస్తుతం నిజమాబాద్ అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఏఐఎస్ అధికారి కరోలిన్ చింగ్ తియాన్‌మావి దేవరకొండ సబ్ కలెక్టర్‌గా నియమించారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.


