రైతు బీమాకు మంగళం | - | Sakshi
Sakshi News home page

రైతు బీమాకు మంగళం

Sep 7 2026 7:21 AM | Updated on Sep 7 2026 7:21 AM

బీమా అమలు కావడంలేదు

ఈ ఏడాది ప్రీమియం చెల్లించని ప్రభుత్వం

జిల్లాలో 2.97 లక్షల రైతు కుటుంబాల్లో ఆందోళన

నల్లగొండ అగ్రికల్చర్‌ : ఎనిమిదేళ్లుగా రైతుల కుటుంబాలకు నిలిచిన రైతు బీమా పథకం నిలిచిపోయింది. జిల్లా వ్యాప్తంగా 2.97 వేల కుటుంబాలకు రైతు కుటుంబాలకు బీమా బంద్‌ అయింది. రైతులపై ఒక రూపాయి కూడా భారం వేయకుండా మొత్తం ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి అమలు చేసిన ఈ పథకాన్ని ఆగస్టు 14 నుంచి నిలిపివేయడంతో అర్హులైన రైతు కుటుంబాలకు భరోసా లేకుండా పోయింది. 2025–26 రైతు బీమా కాలపరిమితి గత ఆగస్టు 14న ముగియగా, 2026–27 సంవత్సరానికి ప్రభుత్వం రైతులకు సంబంధించిన బీమా పథకం ప్రీమియాన్ని చెల్లించలేదు. జిల్లా వ్యాప్తంగా 2.97 లక్షల మంది రైతు కుటుంబాలు రైతు బీమా పథకం అర్హులుగా వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

రైతు మరణిస్తే.. రూ.5 లక్షలు

2018 ఆగస్టు 15న రైతు బీమా పథకాన్ని అప్పటి ప్రభుత్వం ప్రారంబించింది. రైతు పేరిట కుంట వ్యవసాయ భూమి ఉన్నా ఈ పథకం వర్తించేలా పథకాన్ని రూపొందించింది. 18 నుంచి 59 వయసు గల పట్టాదారు పాస్‌ బుక్‌ ఉన్న రైతులను ఈ పథకం పరిధిలోకి తెచ్చింది. రైతు మృతిచెందితే నామినికి రూ.5 లక్షల బీమా పరిహారం అందించేలా చర్యలు చేపట్టి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు వేల మంది రైతు కుటుంబాలకు మరణించిన వారం నుంచి 10 రోజుల్లోపే బీమా సొమ్మును నామిని బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఈ పథకానికి సంబందించి ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లించకపోతే అర్హులైన రైతు కుటుంబాల్లో ఆందోళన నెలకొంది.

రైతు బీమా పథకానికి సంబందించి ప్రభుత్వం ప్రీమియం చెల్లించలేదు. దీంతో రైతులకు బీమా అమలు కావడం లేదు. ఈ విషయాన్ని రైతు గమనించాలి.

– ఉల్లోజు వినోద్‌కుమార్‌,

జిల్లా వ్యవసాయాధికారి, నల్లగొండ

2018–19 నుంచి రైతు బీమా

పథకం పొందిన రైతులు ఇలా..

సంవత్సరం బీమాపొందిన అందిన సొమ్ము

రైతుకుటుంబాలు (రూ.కోట్లలో..)

2018–19 1304 65.45

2019–20 1217 60.85

2020–21 1693 84.65

2021–22 1550 72.50

2022–23 1432 71.60

2023–24 1431 71.55

2024–25 1411 70.55

2025–26 1259 62.95

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement