నల్లగొండ : పీఆర్‌టీయూ టీఎస్‌లో అత్యధిక సభ్యత్వం కలిగిన జిల్లాగా నల్లగొండకు ప్రత్యేక స్థానం ఉందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండలో పీఆర్టీయూటీఎస్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ అభ్యర్థిగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భిక్షంగౌడ్‌ను నిలబెట్టనున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 1న జరిగిన ధర్నాకు నల్లగొండ నుంచి ఉపాధ్యాయులు తరలివచ్చి విజయవంతం చేశారని అభినందించారు. ఈ ధర్నా వల్ల పీఆర్సీ, హెల్త్ కార్డుల సమస్య పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి భిక్షంగౌడ్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి సంఘం ఏ పిలుపు ఇచ్చిన ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లా అధ్యక్షుడు కాలం నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి మేకల జానారెడ్డి, క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోమటిరెడ్డి నరసింహారెడ్డి, గానూతల వెంకటరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, ఫణికుమార్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎన్నిక
పీఆర్టీయూ టీఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా కాళం నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మేకల జానారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవులకు ఆశావహులు ఎక్కువగా ఉన్నప్పటికీ.. నాయకత్వం అందరితో చర్చించి ఏకాభిప్రాయం కుదిర్చింది. దీంతో గతంలో బాధ్యతలు నిర్వహించిన నారాయణరెడ్డి, జానారెడ్డికే మరోసారి అవకాశం దక్కింది.
జానారెడ్డి
నారాయణరెడ్డి


