న్యూస్‌రీల్
వైద్య రంగంలో కీలక మార్పులు
వివాహిత దారుణ హత్య
పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తోందన్న కక్షతో ఓ వివాహితను ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేశాడు.
వియత్నాం బుద్ధ విగ్రహం
నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో వియత్నాం దేశానికి చెందిన బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ఆదివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2026
- 8లో
జాతీయ పతాకాన్ని ఎగురవేసి సెల్యూట్ చేస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చిత్రంలో ఎమ్మెల్సీ సత్యం, కలెక్టర్, ఎస్పీ
సీపీఎం నాయకుల అరెస్ట్‌పై ఖండన
నల్లగొండ టౌన్ : డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి అడ్డంకులు సృష్టిస్తారనే అపోహతో, సీఐటీయూ, సీపీఎం నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం ప్రజా స్వామ్య హక్కులను కాలరాయడమేనని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో ఖండించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజునే ప్రజల హక్కుల కోసం ప్రశ్నించే నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం కలిగించాలనే ఉద్దే శం తమకు లేదని, కేవలం ప్రజల హక్కులు, సమస్యలపై ప్రశ్నిస్తున్న నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. పోలీసులు ప్రజాస్వామ్య పద్ధతులను పాటించాలని ఆయన డిమాండ్ చేశారు.
రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ నుంచి ముశంపల్లి వెళ్లే రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు పోతెపాక సాంబయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పట్టణ శివారులో రోడ్డు పనులు పరిశీలించి మాట్లాడారు. మంత్రి వెంకట్‌రెడ్డి రోడ్డు పనులు ప్రారంభించి రెండేళ్లు దాటినా ఇంతవరకు పనులు పూర్తి కాకపోవడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు పనులు త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డుకు ఇరువైపుగా డ్రెయినేజీ వ్యవస్థ నిర్మించాలని కోరారు.
నృసింహ క్షేత్రంలో నిత్య కల్యాణ వేడుక
యాదగిరిగుట్ట: శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్య కల్యాణ వేడుకను ఆలయ అర్చకులు విశేషంగా నిర్వహించారు. శనివారం వేకువజామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాతం, అభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్ర నామార్చన పూజలను జరిపించారు. ఇక ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలను నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో ముందుగా శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల నిత్యకల్యాణం ఆలయ ఆచార వ్యవహారాలతో చేపట్టారు. సాయంత్రం వేళ భక్తుల నడుమ జోడు సేవలను మంగళ వాయిద్యాల మధ్య తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ‘నల్లగొండ నా ఊపిరి. మీ ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడానికి.. జిల్లాను ప్రగతి బాటలో ముందుంచడానికినా నా ప్రాణాలైనా అడ్డుపెడతా’ అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ‘అధికారం శాశ్వతం కాదు. ప్రజల కోసం చేసిన పోరాటం మాత్రమే శాశ్వతం. ప్రజల కోసం చేసిన త్యాగమే చరిత్రలో నిలిచిపోతుంది’ అని పేర్కొన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్లగొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
మహిళలకు ‘మహాలక్ష్మి’ అండ
మహాలక్ష్మి పథకం కింద మహిళలు, ట్రాన్‌న్స్‌జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని మంత్రి తెలిపారు. నల్లగొండ జిల్లాలో ఇప్పటివరకు 8.73 కోట్ల ఉచిత ప్రయాణాలకు రూ.408.20 కోట్ల మేర లబ్ధి చేకూరిందన్నారు. వానాకాలం సీజన్‌లో జిల్లాలో 5,35,253 మంది రైతులకు ఎకరాకు రూ.715 కోట్ల రైతు భరోసా సొమ్ము ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. రైతుబీమా కింద 1,143 మంది కుటుంబాలకు రూ.57.15 కోట్లు అందించామన్నారు. నిరుపేదల సొంత ఇంటి కలను నిజం చేయడానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో 5,42,194 కుటుంబాలకు 28,953 మెట్రిక్ టన్నుల నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలో 81,279 కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని, ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో 1,55,114 కొత్త పేర్లు నమోదు చేశామని చెప్పారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల పనులు కొనసాగుతున్నాయన్నారు.
మహిళా శక్తికి పెద్దపీట
కలెక్టరేట్‌లో మహిళా శక్తి క్యాంటిన్ ఏర్పాటు చేశామని, రూ.2.5 కోట్లతో ‘నీలగిరి మహిళా మార్ట్’ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు. గంధంవారిగూడెంలో 1.20 ఎకరాల్లో రూ.3.50 కోట్లతో మహిళా శక్తి పెట్రోల్ పంపును ప్రారంభిస్తున్నామని చెప్పారు. నల్లగొండ నియోజకవర్గంలోని నల్లగొండ, కనగల్, తిప్పర్తి మండలాల్లో 5 ఎకరాల చొప్పున రైస్ మిల్లుల స్థాపనకు భూములను గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు.
విద్యుదుత్పత్తిలో ముందడుగు
యాదాద్రి థర్మల్ పవర్‌స్టేషన్‌్‌లో నాలుగు యూనిట్లలో రోజుకు 76.8 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. ఐదో యూనిట్‌ను ఆగస్టు నెలాఖరుకు పూర్తి చేస్తామన్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, శంకర్‌నాయక్, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌రెడ్డి, మేయర్ బుర్రి చైతన్య, కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్‌చంద్ర పవార్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ప్రేమకరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 30 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించి 3 లక్షల ఎకరాలకు సాగునీరు, 516 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు తాగునీరు అందించడమే లక్ష్యమన్నారు. ఎస్‌ఎల్‌బీసీ హై లెవల్ కెనాల్ లైనింగ్ పనులకు రూ.442 కోట్లు, లో లెవల్ కెనాల్ లైనింగ్ పనులకు రూ.44.22 కోట్లు మంజూరు చేశామన్నారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు రూ.1,800 కోట్లు మంజూరు చేశామని, పనులు కొనసాగుతున్నాయన్నారు.
నల్లగొండ : పేదల చిరకాల స్వప్నమైన సొంతింటి కలను సాకారం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నల్లగొండ పట్టణంలో గొల్లగూడ శివారు కలెక్టరేట్ వెనుకభాగంలో నిర్మించిన 552 డబుల్ బెడ్‌రూం ఇళ్లను శనివారం ఆయన ప్రారంభించి, లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలివేసిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను రూ.35 కోట్లతో పూర్తి చేసి పేదలకు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇళ్లు పొందిన 552 కుటుంబాలకు అవసరాల కోసం తన సొంత నిధుల నుంచి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. నల్లగొండ కార్పొరేషన్‌లో ఇంకా ఇళ్లు రాని అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల సముదాయంలో నివాసితుల సౌకర్యార్థం రేషన్ షాపు, సూపర్ బజార్ ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. ఇళ్లు రాని అర్హులైన వారు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తాను బతికున్నంతకాలం ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటానని, తనకు చేతనైనంతవరకు పేదలకు సాయం చేస్తానని చెప్పారు. ఎంపీ రఘువీర్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయించారని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్‌చంద్ర పవర్, మేయర్ బుర్రి చైతన్య, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆఫీస్ ఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ (ట్రెయినీ) శ్రీకాంత్‌రెడ్డి, తహసీల్దార్ పరుశురాం, కార్పొరేటర్ జ్ఞానేశ్వరి, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్‌రెడ్డి, గృహ నిర్మాణ అధికారి డి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
డబుల్ బెడ్‌రూం ఇంటిని ప్రారంభిస్తున్న మంత్రి కోమటిరెడ్డి, కలెక్టర్ చంద్రశేఖర్, లబ్ధిదారులు
పంటల సాగు ఇలా..
పంట సాగు ఎకరాల్లో
పత్తి 6,02,000
వరి 4,38,762
జొన్న 207
కంది 11,240
పెసర 14,221
మినుము 5,599
ఆముదం 33
వేరుశనగ 65
ఇతర పంటలు 110
జిల్లాలో 38,403 మంది పేదలు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందగా రూ.119.11 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో అదనంగా 100 పడకల భవనం రూ.14.60 కోట్లతో పూర్తయిందన్నారు. నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక లాప్రోస్కోపీ యూనిట్‌ను అందుబాటులోకి తెచ్చామ, నకిరేకల్ వైద్యశాలను 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేసి ప్రారంభానికి సిద్ధం చేశామని తెలిపారు.
ఫ అర్హులకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం
ఫ విద్యా, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తున్నాం
ఫ నీలగిరిలో మహిళ మార్ట్ ఏర్పాటు చేస్తున్నాం
ఫ నియోజకవర్గానికి ఒక మహిళ శక్తి పెట్రోల్ బంక్
ఫ స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి


