ముగిసిన వృత్యంతర శిక్షణ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన వృత్యంతర శిక్షణ

Aug 8 2026 12:59 AM | Updated on Aug 8 2026 12:59 AM

నల్లగొండ : జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతిక్‌ ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు చెందిన ప్రభుత్వ అర్థశాస్త్ర అధ్యాపకులకు మూడు రోజుల పాటు నిర్వహించిన ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం శుక్రవారం ముగిసింది. రాష్ట్రస్థాయి మాస్టర్‌ ట్రైనర్‌ షేక్‌ జానీ పాషా, డీఆర్‌పీ గోలి సైదులు ఆధ్వర్యంలో శిక్షణ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ సుధారాణి బోధనాభ్యసన సామగ్రి, పటాల రూపకల్పనలో ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు. ఈ శిక్షణ అధ్యాపకుల నైపుణ్యాలను మరింత మెరుగుపరుస్తుందని మాస్టర్‌ ట్రైనర్‌ షేక్‌ జానీ పాషా తెలిపారు. కార్యక్రమంలో డీఐఈఓ దస్రూనాయక్‌, ప్రిన్సిపాల్‌ మెరుగు రాకేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement