మిర్యాలగూడ : నల్లగొండలోనవంబర్ 18, 19, 20, 21 తేదీల్లో జరిగే 36వ ఆలిండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) మహాసభలను జయప్రదం చేయాలని ఏఐకేఎస్ కేంద్ర కమిటీ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి కోరారు. మంగళవారం మిర్యాలగూడ మండలంలోని శ్రీనివాస్‌నగర్‌లో ఆయన ఇంటింటికి వెళ్లి మహాసభల కరపత్రాన్ని అందించి మాట్లాడారు. ఈ మహాసభలకు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల రైతు ఉద్యమ నాయకులు వస్తారని, వారు రైతాంగ సమస్యల పరిష్కారం కోసం చర్చించబోయే విషయాలు భవిష్యత్‌లో రైతు హక్కుల సాధనకు ఉపయోగపడుతున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే రైతులకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డబ్బికార్ మల్లేష్, నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, కందుకూరి రమేష్, నాగరాజు, సైదాచారి, సైదులు తదితరులు పాల్గొన్నారు.


