నల్లగొండ : ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై ఆయా శాఖల అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజలవద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. గ్రీవెన్స్‌లో రెవెన్యూ శాఖకు 81, ఇతర అధికారులకు 57.. మొత్తం 138 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ సందర్భంగా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రతి సోమవారం మండల, డివిజన్ స్థాయిలో నిర్వహించే ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై కూడా దృష్టి సారించి పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ వివిద శాఖల అధికారులతో సమీక్షించార. మండలాల ప్రత్యేక అధికారులు హాస్టళ్లు, ఇతర ప్రభుత్వ సంస్థలన తనిఖీ చేసిన నివేదికలను తప్పనిసరిగా సమర్పించాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ (ట్రెయినీ) శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


