దేవరకొండ : మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కొండభీమనపల్లి రైతువేదికలో ఆయా మండలాలకు చెందిన ఏపీఎంలు, సీసీలు, వీఓఏలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వయం సహాయక సంఘాలు, గ్రామ సంఘాల రికార్డులు, లెక్కలను ప్రతి నెలా అత్యంత పారదర్శకంగా నమోదు చేయాలన్నారు. సభ్యులు తీసుకున్న రుణాల రికవరీ, బ్యాంకు లింకేజీల చెల్లింపులు సకాలంలో జరిగేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రగతి వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలని, సభ్యులు ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. సమావేశంలో అడిషనల్ డీఆర్‌డీఓ శ్రావణ్, ఆర్‌ఎం శ్రీలేఖ, డీపీఎంలు రామలింగయ్య, మోహన్‌రెడ్డి, వీరయ్య పాల్గొన్నారు.


