నల్లగొండ : చేనేత కళాకారులు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముద్ర రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో చేనేత కళాకారులకు ముద్ర రుణాలపై నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన ప్రతి చేనేత కార్మికుడు ముద్ర రుణాలను వినియోగించుకుని తమ వృత్తిని విస్తరించి, ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. ముద్ర పథకం కింద రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వ్యక్తిగతంగా, సంఘాలుగా లేదా క్లస్టర్‌ల రూపంలో కూడా ఈ రుణాలను పొందే అవకాశం ఉందన్నారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జిల్లాలోని చేనేత కళాకారుల సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించి, సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చండూరు మాజీ జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం చేనేత రంగ సమస్యలను కలెక్టర్‌కు వివరించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, చేనేత సహాయ సంచాలకుడు గోవిందయ్య, లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రామిక్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


