సొసైటీలకు భారీగా నష్టం
గట్టుప్పల్ : ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్)లు యూరియా బుకింగ్ నిలిపేశాయి. పీఏసీఎస్‌లకు యూరియా రవాణా చార్జీల చెల్లింపు నిలిపివేస్తున్నట్లు తాజాగా (జూలై 14న) మార్క్‌ఫెడ్ నుంచి ఆదేశాలు అందాయి. ఈ నిర్ణయంతో పీఏసీఎస్‌లకు నష్టం వస్తుందని.. యూరియా అమ్మలేమని పదిరోజులుగా జిల్లా వ్యాప్తంగా 43 పీఏసీఎస్‌లు బుకింగ్ నిలిపి వేశాయి.
14న మార్కెఫెడ్ నుంచి ఉత్తర్వులు
యూరియా దిగుమతికి అవసరమైన రవాణా చార్జీలను ఇప్పటి వరకు మార్క్‌ఫెడ్ చెల్లిస్తోంది. యూరియా దిగుమతి రవాణా చార్జీలను మీరే భరించాలని జూలై 14న మార్క్‌ఫెడ్ నుంచి సహకార సంఘాలకు ఉత్తర్వులు అందాయి. రవాణా చార్జీలు భరించి మార్క్‌ఫెడ్ నుంచి యూరియా తీసుకుని ఎమ్మార్పీకి విక్రయిస్తే.. రూ.లక్షల్లో వచ్చే నష్టం మేం భరించలేమని సహకార సంఘాల సీఈఓలు అంటున్నారు. ఇప్పటికే చండూరు, మర్రిగూడెం, మునుగోడు ప్రాంతాలకు చెందిన సహకార సంఘాలు యూరియా బుకింగ్ బంద్ చేశాయి.
రైతులకు ఇబ్బందులు
రెండు, మూడు రోజులుగా కురుస్తున్న చిరుజల్లులతోరైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. పత్తి చేలలో గుంటకలు తోలుకుని.. యూరియా పెట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. యూరియా బుక్ చేసుకునేందుకు ప్రయత్నించినా.. నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో పంటలకు సమయానికి యూరియా అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు.
ఫ పీఏసీఎస్‌లపై రవాణా చార్జీల భారం మోపిన మార్క్‌ఫెడ్
ఫ నష్టపోతామంటున్న సీఈఓలు
ఫ యూరియా బుకింగ్ నిలిపివేసిన సొసైటీలు
మార్క్‌ఫెడ్ నుంచి యూరియా బస్తా రూ.252.43(కంపెనీల బట్టీ ఎక్కువ, తగ్గుదల)కు లభ్యమవుతుంది. రవాణా చార్జీలను మార్క్‌ఫెడ్ భరిస్తుంది. దీంతో పీఏసీఎస్‌లు రైతులకు (ఎమ్మార్పీకి) రూ.267కు విక్రయిస్తున్నాయి. ఇందులో లారీ నుంచి యూరియా (450 బస్తాలు) దిగుమతికి హమాలీ చార్జీ(బస్తాకు రూ.10 చొప్పున)4,500 ఖర్చవుతాయి. లారీ యూరియా రూ.267కు విక్రయిస్తే పీఏసీఎస్‌కు రూ.2,056.50 మిగులుతాయి. ప్రస్తుతం రవాణా చార్జీలు రద్దుతో మార్క్‌ఫెడ్ నుంచి సహకార సంఘాలకు యూరియా దిగుమతి చేసినందుకుగాను లారీ ట్రాన్స్‌ఫోర్ట్ చార్జీ రూ.20 వేలు (దూరాన్ని బట్టి మారుతుంది) అంటే ప్రతి లారీ యూరియా ఎమ్మార్పీకి అమ్మితే పీఏసీఎస్‌లకు రూ.17,943.50 నష్టం వస్తుంది.


