హైవేపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు | - | Sakshi
Sakshi News home page

హైవేపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

Jul 29 2026 1:46 AM | Updated on Jul 29 2026 1:46 AM

కట్టంగూర్‌ : హైదరాబాద్‌–విజయవాడ 65వ నంబర్‌ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ ఆదేశించారు. కట్టంగూర్‌ పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్‌ కేసుల స్థితి, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్‌ నిర్వహణ, సిబ్బంది హాజరు వివరాలను పరిశీలించి మాట్లాడారు. పెండింగ్‌ కేసు వివరాలను త్వరితగతిన పూర్తిచేసి బాధితులకు సత్వర న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. బ్లాక్‌స్పాట్‌ల వద్ద అప్రమత్తంగా విధులు నిర్వహించడంతో పాటు ప్రజల్లో రోడ్డు భద్రత, సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ మోసాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి వేగవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట శాలిగౌరారం రూరల్‌ సీఐ రాజశేఖర్‌, ఎస్‌ఐ మునుగోటి రవీందర్‌, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement