తిరుగులేని సంస్థగా భారతి సిమెంట్‌ | - | Sakshi
Sakshi News home page

తిరుగులేని సంస్థగా భారతి సిమెంట్‌

Jul 29 2026 1:46 AM | Updated on Jul 29 2026 1:46 AM

వలిగొండ : సిమెంట్‌ రంగంలో తిరుగులేని సంస్థగా వికాట్‌ గ్రూపు భారతి సిమెంట్‌ ఎదుగుతుందని ఆ సంస్థ చీఫ్‌ మేనేజర్‌ మార్కెటింగ్‌ అధికారి నాగేశ్వరరావు అన్నారు. వలిగొండ మండలం మత్స్యగిరి ఆలయ సమీపంలోని ఓ రిసార్ట్‌లో మంగళవారం నిర్వహించిన భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మార్కెట్‌లో లభించే ఇతర సిమెంట్‌తో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్‌ సిమెంట్‌తో నిర్మాణ ప్రక్రియ చాలా వేగవంతంగా పూర్తవుతుందని అన్నారు. భారతి సిమెంట్‌ ఉత్పాదన 12 దేశాలలో విస్తరించిందని పేర్కొన్నారు. భారతి సిమెంట్‌ సర్వీస్‌ చాలా వేగంగా ఉంటుందని, అల్ట్రాఫాస్ట్‌ వినియోగదారులకు ఉచిత సాంకేతిక సహాయం అందజేస్తామని, స్లాబ్‌, కాంక్రీట్‌ వేసే సమయంలో నిపుణులైన భారతి సిమెంట్‌ ఇంజనీర్లు సైట్‌ వద్దకే వచ్చి సహాయపడవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్‌ మేనేజర్‌ సునీల్‌, మార్కెటింగ్‌ అధికారి రజనీకాంత్‌, సీనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ శ్రీధర్‌, డీలర్‌ హరిబాబు, భవన నిర్మాణ కార్మికులు నరసింహ, పోలెపాక శంకర్‌, శ్యామల మల్లేశం, సారయ్య, లక్ష్మణ్‌, మల్లేశం, రామచంద్రం, జహంగీర్‌, మధు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement